Political
చంద్రబాబు నాయుడు
గెలుపు రహస్యం ఏమిటి? దాదాపు పదేళ్లపాటు దూరంగా ఉండిపోయిన టిడిపి అధినేత
పట్ల ప్రజల వైఖరిలో ఇప్పటికీ మార్పు రాలేదా? ఆయనను నమ్మి ప్రజలు వోటు
వేయలేదా? అవుననే అంటున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే
ఆర్‌కె రోజా. చంద్రబాబు గ్లామర్ చూసి ప్రజలు వోటేయలేదన్నది ఆమె అభిప్రాయం.
సినీ నటుడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కారణంగానే టిడిపి
అధికారంలోకి వచ్చిందని ఆమె చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కాలికి బలపం
కట్టుకుని చంద్రబాబు తరఫున ప్రచారం చేయడం వల్లనే టిడిపి అధికారంలోకి
రాగలిగిందని ఆమె విశ్లేషించారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏమి
చేసినా చెల్లుతుందని చంద్రబాబు భావిస్తున్నారని..అందుకే రైతు రుణ మాఫీ
విషయంలో ఆయన ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని రోజు విమర్శించారు.
చంద్రబాబు నిజస్వరూపం ఏమిటో ప్రజలకు త్వరలోనే తెలిసొస్తుందన్నది ఆమె
అభిప్రాయం. ఎటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రైతు రుణ
మాఫీపై చంద్రబాబుకు నెలరోజుల గడువు ఇచ్చారు కాబట్టి..చంద్రబాబు ఈ లోపలే తన
నిర్ణయాన్ని అమలు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
No comments:
Post a Comment